Saturday, July 11, 2026
E-PAPER
Homeఖమ్మంరేపు కొత్తగూడెంలో జనసేన బహిరంగ సభ

రేపు కొత్తగూడెంలో జనసేన బహిరంగ సభ

- Advertisement -

– విజయవంతం చేయండి
– సత్తుపల్లి పట్టణ జనసేన అధ్యక్షుడు ఆళ్ల నరేష్
నవతెలంగాణ-సత్తుపల్లి : ​కొత్తగూడెంలో రేపు (ఆదివారం) జరుగనున్న జనసేన పార్టీ భారీ బహిరంగ సభను  విజయవంతం చేయాలని ఆ పార్టీ సత్తుపల్లి పట్టణ  అధ్యక్షుడు ఆళ్ల నరేష్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలను కోరారు. శనివారం సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేష్ మాట్లాడుతూ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జనసైనికులు, నాయకులు, అభిమానులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఈ సభ దిక్సూచిగా మారనుందని, కార్యకర్తలు ఉత్సాహంతో పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -