Saturday, July 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరులో రేపు మంత్రుల పర్యటన…

ఆలేరులో రేపు మంత్రుల పర్యటన…

- Advertisement -

– భారీగా తరలిరావాలని కాంగ్రెస్ పిలుపు
నవతెలంగాణ-ఆలేర్ రూరల్ : ఆలేరు మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆలేరు మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్ పిలుపునిచ్చారు. రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొనే అభివృద్ధి కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా వంగపల్లి హైవే అండర్‌పాస్ రోడ్డుతో పాటు ఆలేరు నియోజకవర్గంలోని డబుల్‌వే బీటీ రోడ్లను ప్రారంభించనున్నారు.అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో జరిగే సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.ఈ కార్యక్రమంలో ఆలేరు మండలంలోని గ్రామ శాఖ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు,మండల,టౌన్ పార్టీ కమిటీ సభ్యులు, సర్పంచులు,ఉపసర్పంచులు,వార్డు సభ్యులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు,మహిళా నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంధమల్ల అశోక్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -