నిలదీసిన న్యూజిలాండ్ జర్నలిస్ట్
నార్వే పర్యటనలోనూ ఎదురైన ఇదే ప్రశ్న
ఆక్లాండ్ : భారతీయ దౌత్య వేత్తలతో జరిగిన సంభాషణలో ప్రధాని మోడీ విలేకరుల సమావేశాలు నిర్వహించ కపోవడంపై న్యూజిలాండ్ జర్నలిస్ట్ ఒకరు ప్రశ్న లేవనెత్తారు. ద్వైపాక్షిక సంబంధా లను బలోపేతం చేయడం, రెండు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించిన మోడీ మూడు దేశాల పర్యటన లో భాగంగా చివరి దశలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయనకు ఊహించని విధంగా ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ, విదేశీ వ్యవహారాల శాఖ అధికారి రుద్రేంద్ర టాండన్ మాట్లాడారు. ప్రధాని రాజకీయ విధానంపై వ్యాఖ్యానిం చడం తన పరిధిలోని అంశం కాదన్నారు. ‘‘ఒక ప్రభుత్వం తరఫున ప్రతినిధి అయిన మోడీ రాజకీయ పద్ధతిని ప్రశ్నించడం తగదు’’ అని పేర్కొన్నారు. అంతేకాక మోడీ సంభాషణా శైలిని వివరిస్తూ, మధ్య వర్తుల ద్వారా కాకుండా ఓటర్లతో నేరుగా సంభాషించడానికి ఇష్టపడే నాయకుడిగా టాండన్ ఆయనను అభివర్ణించారు.
నార్వే జర్నలిస్ట్ వివాదం
నార్వే పర్యటనలోనూ మోడీకి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మే నెలలో ఓస్లోలో నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చినప్పుడు, జర్నలిస్ట్ హెల్లె లింగ్ అక్కడి నుండి వెళుతున్న మోడీని ఉద్దేశించి, జర్నలిస్టుల ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వరని అడిగారు. ఆ ప్రశ్నకు ప్రధాని స్పందించలేదు. అయితే, ఆ ఘటనపై మీడియాలోని కొన్ని వర్గాలలో , సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఏప్రిల్‌లో భారత్, న్యూజిలాండ్ లు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంత కం చేసిన కొన్ని నెలల తర్వాత ఈ పర్య టన జరిగింది. 2025 మార్చిలో న్యూజి లాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారత పర్యటన సందర్భంగా మోడీ, లక్సన్‌ల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనం తరం ఈ ఒప్పందం కుదిరింది. ఇరు పక్షాలు ఆర్థిక, వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాయి. కాగా 2026 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో 180 దేశాలలో భారతదేశం ప్రస్తుతం 157వ స్థానంలో ఉంది.
ప్రధాని మోడీ విలేకరుల సమావేశాలెందుకు పెట్టరు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


