Sunday, July 12, 2026
E-PAPER
Homeజాతీయంవికసిత్‌ భారత్‌ బిల్లు కు నో

వికసిత్‌ భారత్‌ బిల్లు కు నో

- Advertisement -

వ్యతిరేకిస్తున్న ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర వర్శిటీలు
తమను ఆ పరిధి నుంచి మినహాయించాలని వినతి
న్యూఢిల్లీ :
భారతదేశ ఉన్నత విద్య నియంత్రణా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశించిన వికసిత్‌ ‌భారత్‌ ‌శిక్షా అధిష్టాన్‌ ‌బిల్లు, 2025లోని అనేక నిబంధనల నుండి తమను మినహాయించాలని కోరుతూ ఐఐటీలు, ఐఐఎంలతో సహా జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు (ఐఎన్‌ఐ) కేంద్రం తీసుకువచ్చిన ఈ బిల్లును వ్యతిరేకించాయి. కేంద్ర విశ్వవిద్యాలయాలతో సహా ఈ సంస్థలన్నీ తమ వ్యవస్థాగత స్వయంప్రతిపత్తిని పరిరక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. బిల్లులోని వైరుధ్యాలను ఎత్తి చూపుతున్నాయి. కేంద్రీకరణకు సంబంధించిన నిబంధనలు వంటి అంశాలను విమర్శి స్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఎంపీ డి.పురందేశ్వరి నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఈ బిల్లును సమీక్షిస్తోంది. జెపిసికి అందిన సమాచారాన్ని బట్టి ఎన్‌‌డీఎ పాలిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, మేఘాలయ, మధ్యప్రదేశ్‌లు ఈ బిల్లులోని కొన్ని నిబంధనల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొత్త నియంత్రణా వ్యవస్థ పరిధి నుండి తమ సంస్థలకు మినహాయింపు ఇచ్చే అంశాన్ని బిల్లులో స్పష్టంగా చేర్చాలని ఐఐటిలు, ఐఐఎంలు, ఐఐఐటి, ఐఐఎస్‌ఇఆర్‌‌లు కోరుతున్నాయి. కాగా ఆన్‌‌లైన్‌ ‌కార్యక్రమాలకు రెగ్యులేటరీ ఆమోదాలకు సంబంధించిన కొన్ని నిబంధనలు, కొత్త కాలేజీల ప్రారంభం, పెనాల్టీ నిబంధనల వర్తింపు వంటి అంశాల నుండి ఐఐటిలను మినహాయించాలని ఐఐటి మద్రాసు కోరుతోంది. పరిశోధన, సిలబస్‌, విద్యా కార్యకలాపాలకు సంబంధించి తమకు పూర్తిగా వ్యవస్థాగతమైన స్వయంప్రతిపత్తి వుండేలా చూడాల్సిన అవసరం వుందని ఐఐటిలు, ఐఐఎంలు, ఐఐఎస్‌ఇఆర్‌‌లు పేర్కొంటున్నాయి. బిల్లు పరిధి నుండి చట్టం, ఔషధ రంగాలను మినహాయించడంలో తార్కికతను ఐఐటీ బాంబే ప్రశ్నించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -