Sunday, July 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బురదమయం లేని గ్రామంగా తీర్చిదిద్దుతాం..

బురదమయం లేని గ్రామంగా తీర్చిదిద్దుతాం..

- Advertisement -

– బడి తండా గ్రామ సర్పంచ్ బిలావత్ ధనమా అమృనాయక్ 
నవతెలంగాణ నెల్లికుదురు  : మండలంలోని బడి తండ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రహదారులు వరదమయం లేని రహదారులుగా తీర్చిదిద్దామని ఆ గ్రామ సర్పంచ్ బిలావత్ ధనమ్మ అమృనాయక్ అన్నారు. ఆదివారం రాము ఇంటి నుండి అమృనాయక్ వరకు గ్రావెల్ మట్టి పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి వీధులలో బురద మాయం లేకుండా సిసి రోడ్లు వేయిస్తామని అన్నారు. అంతేకాకుండా వ్యవసాయ భూములకు వద్దకు వెళ్లే దారి బృందావన ఉండడంతో మట్టి పోయించే కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఎంపీ బలరాం నాయక్ సహకారంతో గ్రామాన్ని రంగాలుగా అభివృద్ధి పరుస్తామని తెలిపారు. త్వరలోనే అధిక నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని పూర్తిస్థాయిలో అన్ని హంగులు ఉండే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిట్టెమ్మ తోపాటు పాలకవర్గం గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -