నవతెలంగాణ – ధర్పల్లి : మండలకేంద్రంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం”ప్రేమతరు” కార్యక్రమం చక్కగా నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి “ప్రేమతరు” పేరు పెట్టినట్లు తెలిపారు. ఇందులో ఉసిరి, మందారం, సీతాఫలం, తీగ మల్లెలు. మొదలైన మొక్కలు నాటడం జరిగింది. అంతే కాకుండా వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జూలై 12న సమితిలలో 100 మొక్క లు, భజన మండలిలో 50 మొక్కలు నాటారు. జూలై 12, ఆగస్టు 3 తేదీలలో రెండు విడతల్లో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని జిల్లా సత్యసాయి సంస్థల అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సత్యసాయి సంస్థల పిలుపు మేరకు కార్యక్రమం నిర్వహించి నట్లు తెలిపారు. ఇందులో సత్యసాయి సేవా సమితి పురుష, మహిళా విభాగం, బాల వికాస్ చిన్నారులు పాల్గొన్నారు.
మొక్కలను నాటిన సత్యసాయి సేవ సమితి సభ్యులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


