Sunday, July 12, 2026
E-PAPER
Homeఖమ్మంలక్ష్మీ చైత్ర కు మెరుగైన వైద్యం అందించాలి..

లక్ష్మీ చైత్ర కు మెరుగైన వైద్యం అందించాలి..

- Advertisement -

– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట  :
ములకలపల్లి మండలం కొత్త గంగారం గ్రామానికి చెందిన సోడ్ లక్ష్మి చైత్ర కు హైదరాబాద్‌ లోని నిలోఫర్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అక్కడి వైద్యులు కు సూచించారు.

ఆదివారం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే, చికిత్స పొందుతున్న లక్ష్మి చైత్రను వ్యక్తిగతంగా పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా రోగి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే, చికిత్స విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి వచ్చే అనారోగ్య బాధితులందరికీ నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే సర్జరీలు అవసరమైన పేద రోగులందరికీ ప్రభుత్వం ద్వారా ఎల్‌ఓసీ (రెక్టర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేసి, ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -