Monday, July 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు సోమవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో  గ్రామ ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నులిపురుగుల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగులు నశించి, విద్యార్థులలో రక్తహీనత తగ్గి, శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం కృష్ణవేణి, సీఆర్‌పీ లు అంజయ్య, లలిత, ఉపాధ్యాయ బృందం, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -