- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భోగాపురం విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపునిచ్చింది. ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం పరిధిలోకి ఈ ఎయిర్‌పోర్టును తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం కేటగిరీ-1 విమానాశ్రయాల జాబితాలో 39వ స్థానంలో భోగాపురం చేరింది. ఇక్కడి నుంచి నేరుగా విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి నితేష్ కుమార్ వ్యాస్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నోటిఫికేషన్‌తో ఇమిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా భోగాపురానికి గుర్తింపు లభించింది.
- Advertisement -



