నవతెలంగాణ-మిడ్జిల్
ఐద్వా జిల్లా మాజీ కార్యదర్శి, వాడియాల మాజీ సర్పంచ్ కామ్రేడ్ అరుణ 6వ వర్ధంతి సందర్భంగా మాదిగ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో సోమవారం అరుణ స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా మాదిగ ఉద్యోగ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి గాలి యాదయ్య మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం కోసం, పేదల సమస్యల కోసం, విద్యారంగా బలోపేతానికి నిరంతరం పోరాటం చేసేదని కొనియాడారు. అరుణ అక్క మన మధ్యలో లేకపోయినా.. అరుణమ్మ అక్క బాటలో నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజర్ వాడ్యాల విజయకుమార్, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ నాయక్, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు రవికుమార్, భాస్కరాచారి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కామ్రేడ్ అరుణకు ఘన నివాళులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



