Tuesday, July 14, 2026
E-PAPER
Homeబీజినెస్'మాస్ అఫ్లూయెంట్' వర్గం, ప్రీమియం బ్యాంకింగ్‌లో మారుతున్న ట్రెండ్స్

‘మాస్ అఫ్లూయెంట్’ వర్గం, ప్రీమియం బ్యాంకింగ్‌లో మారుతున్న ట్రెండ్స్

- Advertisement -

నవతెలంగాణ – విశాఖపట్నం: భారతదేశంలో మధ్యతరగతి జనాభా వేగంగా వృద్ధి చెందడం వల్ల సమాజంలో ఒక కొత్త వర్గం ఆవిర్భవించింది. గత కొన్నేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ కేవలం పరిమాణంపైనే కాకుండా నాణ్యత, అధునాతనత్వం వైపు అడుగులు వేయడం వల్ల మంచి ఆదాయం ఉండి, ఖర్చు పెట్టగలిగే ‘మాస్ అఫ్లూయెంట్’ జనాభా గణనీయంగా పెరిగింది.

సాధారణ రిటైల్ కస్టమర్లకు, అలాగే అత్యంత సంపన్నులైన (అల్ట్రా హెచ్ఎన్‌డబ్ల్యూఐ) వ్యక్తులకు మధ్యలో ఉండే ఈ మాస్ అఫ్లూయెంట్ వర్గం, ప్రస్తుతం మార్కెట్ వినియోగాన్ని, ప్రజల ఆకాంక్షలను మరియు ఆర్థిక భాగస్వామ్యాన్ని సరికొత్తగా నిర్వచిస్తోంది.  ప్రపంచవ్యాప్త పరిణామాలపై డిజిటల్ టెక్నాలజీని చక్కగా వాడగలగడమే కాకుండా వీరికి ఖర్చు పెట్టే శక్తి ఎక్కువగానే ఉంటోంది. అలాగే బ్యాంకింగ్ సేవలపై అంచనాలూ ఎక్కువగానే ఉన్నాయి. విలువకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈ వర్గం, బ్యాంకులు అందించే ‘ప్రీమియం బ్యాంకింగ్’ పద్ధతులని పూర్తిగా మార్చేస్తోంది.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రీటెయిల్ లయబిలిటీస్ – TASC & TPP హెడ్ Mr. హితేంద్ర ఝా తెలిపారు, పెరుగుతున్న ఆదాయాలు, వ్యాపార వృద్ధి, మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా గ్లోబల్ లైఫ్‌స్టైల్ సులభంగా అందుబాటులోకి రావడం వల్ల భారతదేశంలో ఈ వర్గం వేగంగా పెరిగింది. అయితే, కేవలం ఆదాయ స్థాయే కాకుండా, వీరి ఆలోచనా విధానం వీరిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ మాస్ అఫ్లూయెంట్ వ్యక్తులు, ఆస్తులను వారసత్వంగా పొందినవారు కాదు. తమ సొంత కష్టంతో సంపదను సృష్టించుకున్న వారు. అందుకే వీరు ప్రతి విషయంలోనూ చాలా విచక్షణతో వ్యవహరిస్తారు. సమయానికి ఎక్కువ విలువ ఇస్తారు మరియు తమకు తగ్గట్టుగా ఉండే ఆర్థిక పరిష్కారాలను ఇష్టపడతారు.

వీరికి బ్యాంకింగ్ అంటే కేవలం డబ్బులు దాచుకోవడం లేదా లావాదేవీలు చేయడం మాత్రమే కాదు. తమ జీవనశైలిలో భాగమైన ప్రయాణాలు, ఆరోగ్యం, వినోదం మరియు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలకు అనుగుణంగా బ్యాంకింగ్ సేవలు కూడా ఉండాలని వారు కోరుకుంటారు.

ఆర్థిక మార్కెట్లలో వ్యక్తిగత పెట్టుబడులు కూడా బాగా పెరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘ఆర్థిక సర్వే 2025-26’ ప్రకారం, వార్షిక కుటుంబ పొదుపు మొత్తాలలో ఈక్విటీలు మరియు మ్యూచువల్ ఫండ్ల వాటా 2012 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2% మాత్రమే ఉండగా, అది 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 15.2 శాతానికి పైగా పెరిగింది. ఈ రకమైన ఆర్థిక అవగాహన, పెట్టుబడులపై ఆసక్తి ఉన్న కస్టమర్లు ఇప్పుడు సంపదను పెంచుకోవాలని, సరికొత్త అనుభూతులను పొందాలని ఆశిస్తున్నారు. విశేషమేమిటంటే, అటు సంపన్నులు, ఇటు ఈ మాస్ అఫ్లూయెంట్ వర్గం ఇద్దరూ దీర్ఘకాలిక సంపద సృష్టి వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

సమగ్రమైన బ్యాంకింగ్ అనుభూతి

దీనికి అనుగుణంగా, భారతీయ బ్యాంకులు కస్టమర్లకు కేవలం విడివిడి ప్రొడక్టులను కాకుండా, వారి జీవనశైలికి ఉపయోగపడే ప్రయోజనాలతో కూడిన సమగ్రమైన సేవలను అందిస్తున్నాయి.

ఆధునిక ఎక్స్‌క్లూజివ్ బ్యాంకింగ్ ప్రోగ్రామ్‌లు కేవలం తక్కువ వడ్డీ రేట్లు లేదా వేగవంతమైన సేవలకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఇందులో వ్యక్తిగత రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, అధిక స్థాయి లావాదేవీల పరిమితులు, ప్రయాణాలు, డైనింగ్, వినోదం వంటి రంగాలలో లైఫ్‌స్టైల్ పార్ట్‌నర్‌షిప్‌లు, హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రయోజనాలు మరియు సాధారణ క్యాష్‌బ్యాక్‌ల కంటే మెరుగైన రివార్డ్ సిస్టమ్స్ వంటివన్నీ కలిసి ఉంటున్నాయి.

అనేక రకాలుగా, ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారా లైఫ్‌స్టైల్ ప్రయోజనాలు పొందడం అనేది, ఈ వర్గం కస్టమర్లు సదరు బ్యాంకు విలువను అంచనా వేయడానికి ఒక ముఖ్యమైన కొలమానంగా మారుతోంది.

ప్రీమియం బ్యాంకింగ్‌లో కొత్త విధానం (ఉదాహరణకు: ఉజ్జీవన్ ఐవరీ)

బ్యాంకులు తమ మాస్ అఫ్లూయెంట్ కస్టమర్ల కోసం సరికొత్త తరం ప్రోగ్రామ్‌లను ప్రారంభిస్తున్నాయి.  ఉదాహరణకు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తీసుకొచ్చిన ‘ఐవరీ’ (Ivory by Ujjivan) ప్లాన్ ఒక సాధారణ ఆర్థిక ప్రొడక్ట్‌లా కాకుండా, ప్రీమియం స్థాయిలో కస్టమర్‌కు నిజంగానే ఒక విభిన్నమైన అనుభూతిని కలిగించేలా రూపొందించబడింది. ఐవరీ అనేది ఒక ప్రీమియం బ్యాంకింగ్ ప్లాన్. ఇది ఒక ప్రత్యేకమైన లైఫ్‌స్టైల్ ప్రయోజనాలు, ఆర్థిక సాధనాలు మరియు కస్టమర్ అవసరాలకు తగ్గట్టుగా ఉండే సేవలను అందిస్తుంది.

ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ నుండి ప్రీమియం మెటల్ డెబిట్ కార్డ్ ద్వారా ప్రపంచవ్యాప్త యాక్సెస్ వరకు, అలాగే ప్రముఖ బ్రాండ్లతో ఆతిథ్య భాగస్వామ్యాల నుండి ఇంటిగ్రేటెడ్ రివార్డుల వరకు, ఈ ప్రోగ్రామ్ మారుతున్న కస్టమర్ల అంచనాలకు అద్దం పడుతుంది.

ఈ ప్రీమియం అనుభూతి అనేది ఐవరీ మెటల్ డెబిట్ కార్డ్ యొక్క అద్భుతమైన ఫీచర్ల ద్వారా లభిస్తుంది. ఇందులో భాగంగా డైనింగ్ మరియు వినోద రంగాలలో కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లైఫ్‌స్టైల్ అనుభవాలతో పాటు వేగంగా లభించే అదనపు రివార్డులు కూడా ఉంటాయి. అంతేకాకుండా, కస్టమర్‌తో బలమైన బంధాన్ని ఏర్పరచుకునే వ్యక్తిగత బ్యాంకింగ్ విధానం కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత. ఇందుకోసం కేటాయించిన ప్రత్యేక సపోర్ట్ టీమ్ వల్ల ఆధునిక కస్టమర్లు తమ రోజువారీ లావాదేవీలను ఎంతో సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే వారి మారుతున్న ఆకాంక్షలకు తగిన పూర్తి విలువను పొందవచ్చు.

ఉజ్జీవన్ యొక్క ‘ఐవరీ’ లాంటి సమగ్రమైన సేవల ప్లాన్, కేవలం సంపన్నుల కోసం ఉండే ఒక విడివిడి హెచ్‌ఎన్‌ఐ బ్యాంక్ అకౌంట్‌లా కాకుండా, కస్టమర్ల దైనందిన జీవితంలో సజావుగా కలిసిపోయేలా రూపొందించబడింది. నిరంతరాయమైన సేవలు మరియు సౌకర్యానికి ప్రాధాన్యతినిస్తూ, బ్యాంకింగ్‌ను రోజువారీ జీవిత అనుభవాలలో ఒక భాగంగా మార్చడం దీని ముఖ్య ఉద్దేశం.

భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

గ్లోబల్ ట్రావెల్, డైనింగ్ అనుభవాల నుండి లైఫ్‌స్టైల్ పార్ట్‌నర్‌షిప్‌ల వరకు, రివార్డ్ పాయింట్లతో కూడిన సేవింగ్స్ అకౌంట్ నుండి ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ వరకు, కస్టమర్ యొక్క ఆర్థిక ప్రయాణాన్ని సరళం చేయడమే కాకుండా మరింత మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశం. దీనితో పాటు కన్సల్టేషన్ సేవలు, బ్యాంకింగ్‌ను కేవలం లావాదేవీలకే పరిమితం చేయకుండా, ఒక నమ్మకమైన బంధంగా మారుస్తున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా సంపద పెరుగుతున్న మార్కెట్లలో భారతదేశం ఒకటిగా అవతరించింది. దేశంలో సంపద సృష్టి విస్తరిస్తున్న తీరుకు ఈ మాస్-అఫ్లూయెంట్ వర్గం యొక్క స్థిరమైన అభివృద్ధి ఒక నిదర్శనం. ఈ మార్పు సహజంగానే మరింత పారదర్శకమైన, అనుభవపూర్వకమైన ఆర్థిక పరిష్కారాలను డిమాండ్ చేస్తుంది. అందువల్ల బ్యాంకులు ఎంత వరకు ప్రత్యేకమైన సేవలను అందిస్తాయి మరియు కస్టమర్ల జీవనశైలికి ఎంత అనువుగా మారతాయనే దానిపైనే ప్రీమియం బ్యాంకింగ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

బ్యాంకుల ముందు చాలా స్పష్టమైన అవకాశం ఉంది. కేవలం లావాదేవీలపైనే కాకుండా, కస్టమర్లతో బలమైన సంబంధాలను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ అనేది ఏదో ఒక బాధ్యతలా కాకుండా, దైనందిన జీవితంలో ఒక సహజమైన భాగంగా అనిపించేలా చేసే బ్యాంకులు మాత్రమే ఈ రంగంలో లీడర్లుగా నిలుస్తాయి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -