Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల విద్యా వనరుల కేంద్రంలో నల్ల రిబ్బన్లతో నిరసన

మండల విద్యా వనరుల కేంద్రంలో నల్ల రిబ్బన్లతో నిరసన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 3 దశలో పోరాటం లో భాగంగా సోమవారం సమగ్ర శిక్ష సిబ్బంది నల్ల రిబ్బన్ లతో నిరసన తెలిపారు.సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ వేతనాలు చెల్లించడంతో పాటు గత సంవత్సరం 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సిఆర్పిల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ గతంలో పీసీసీ అధ్యక్షుడు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ సమస్యలను చాయ్ తాగే లోపల పరిష్కరిస్తానని  హామీ ఇచ్చారని గుర్తు చేశారు.ఈ హామీలను నెరవేర్చాలని సమ్మె సమయంలో చేసిన డిమాండ్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  పరిష్కరిస్తారని ఇచ్చిన హామీ ఇంత వరకు నేర వేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గతంలో నిర్వహించిన 29 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు కూడా ఇప్పటివరకు చెల్లించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ సురేందర్, సిసిఓ ప్రవీణ్, సీఆర్పీ బి. అంజయ్య, మెసెంజర్ రతన్, తదితరులుు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -