బిఆర్ఎస్ నాయకుడు బానోతు రాజ్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఆన్సాన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి, కారొబార్ లు ఎక్కడాని వారు విధుల్లో ఉన్నట్లా.? లేనట్లా.? అని బిఆర్ఎస్ నాయకుడు బానోతు రాజ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజాపాలనలో భాగంగా ఆన్సాన్ పల్లి గ్రామపంచాయతీ గ్రామ కార్యదర్శి,కారో బార్ ఎవరో తెలియని పరిస్థితిలో ప్రజలు అయోమయంలో ఉన్నారని తెలిపారు. గ్రామస్తులు మ్యారేజ్ సర్టిఫికెట్లు, నో డ్యూ సర్టిఫికెట్లు, మరణ ధ్రువీకరణ తదితర ఏ సర్టిఫికెట్ కోసం ప్రజలు జీపీ కార్యాలయం చుట్టూ కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రదక్షణలు చేసినా వీరి అడ్రస్ దొరకడం లేదని పలువురు ఆరోపిస్తున్నట్లుగా తెలిపారు.
గ్రామ కార్యదర్శికి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా నేను కాదని ప్రవీణ్, అబ్బే నే కాదని క్రిష్ణవేణి ఇద్దరు కార్యదర్శులు ఫోన్ స్పందించడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి పంచాయితీ రాజ్ ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి పర్మినెంట్ కార్యదర్శిని, కారొబార్ లను నియమించాలని కోరుతున్నారు.


