Tuesday, July 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐఆర్ ఆన్ లైన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు

ఎస్ఐఆర్ ఆన్ లైన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంతో పాటు పెద్దఎడ్గి, పెద్దగుల్ల గ్రామాలలో ముమ్మరంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జుక్కల్ తహశీల్దార్ మారుతీ, ఎంపీడీఓ శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రామాలలోని యువకుల సాయంతో బీఎల్ఓలు ఎస్ఐఆర్ ఫామ్స్ ఆన్లైన్ నమోదును తప్పులు దొర్లకుండా, వేగంగా పూర్తిచేయాలని సూచించారు. గ్రామాల నుంచి పట్టణ కేంద్రాలకు పనుల నిమిత్తం వలస వెళ్లిన ఓటర్లు ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు చరవాణిలో అందుబాటులో ఉండి, వారి ఓట్లు తొలగిపోకుండా ఆన్ లైన్ నమోదుకు సహకరించాలని కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న బీఎల్ఓ,జీపీఓ, జీపీ కార్యదర్శులను అధికారులు అభినందించారు. జిల్లాలోనే ఎస్ఐఆర్ ఆన్ లైన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేసిన మండలాల జాబితాలో జుక్కల్ మొదటి వరుసలో ఉండేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో,  ఎంఆర్ఓ , డిప్యూటీ తహసిల్దార్, ఆర్ఐ మోహన్, ఎంపీ ఓ రాము, ఆయా గ్రామాల సర్పంచులు పెద్ద ఏడ్గి సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్, పెద్ద గుల్ల సర్పంచ్ మాధవరావు దేశాయ్, జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయా గౌడ్, జీపి కార్యదర్శిలు రమేష్ చారి, శ్రీనివాస్ గౌడ్, జిపిఓ లు, ఆయా గ్రామాల జిపి కార్యవర్గ సభ్యులు, యువకులు విజయ్ కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -