- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశంలో పెరుగుతున్న ఎల్పిజి గ్యాస్ కొరతను తీర్చేందుకు, ఎల్పిజి ఉత్పత్తిని పెంచాలని కేంద్ర పెట్రోలియం శాఖ సమర్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. గృహ అవసరాల గ్యాస్ బుకింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు 25 రోజుల బుకింగ్ పిరియడ్ విధించాలని సూచించింది. గృహ అవసరాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలకు ఎల్పిజి సరఫరాలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమలకు సరఫరాను పర్యవేక్షించడానికి ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
- Advertisement -



