Wednesday, July 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆ సంస్థతో ఎటువంటి సంబంధం లేదు

ఆ సంస్థతో ఎటువంటి సంబంధం లేదు

- Advertisement -

‘రా ఎన్టీఆర్పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థ ఎన్టీఆర్ తో సంబంధం ఉందనే విధంగా ప్రజల్లో భావన కలిగిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అయితే ఆ సంస్థతో ఎన్టీఆర్ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాం అని ఎన్టీఆర్ ప్రతినిధి బృందం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రతినిథి బృందం మరింత వివరణ కూడా ఇచ్చింది.
‘ఎన్టీఆర్ కి గానీ, ఆయన కార్యాలయానికి గానీ, రా ఎన్టీఆర్ అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదు. ఎన్టీఆర్ కి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే ప్రకటిస్తుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం, ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారికమైనవిగా లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని మనవి. అలాగే, సంప్రదాయ మీడియా, డిజిటల్ , సోషల్ మీడియా వేదికలు, ఎన్టీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా, అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నాం` అని ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -