బహిరంగ నిరసనకు ఫెడరేషన్ పిలుపు
విరివిగా పాల్గొనాలని విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్
వర్కింగ్ జర్నలిస్టుల సమ స్యలపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడ బ్ల్యూజేఎఫ్) ఆందోళనకు సిద్ధమైంది. దీర్ఘ కాలికంగా పెండింగ్‌లో ఉన్న సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం సమాచార, పౌరసం బంధాల శాఖ రాష్ట్ర ప్రధాన కార్యా లయం ఎదుట ఉదయం 11 గం టలకు బహిరంగ నిరసనకు పిలుపు నిచ్చింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, అందులో తీవ్ర జాప్యం జరుగుతున్నదన్నారు. ఒకే యూనియన్‌కు చెందిన వాళ్లను అక్రిడిటేషన్ కమిటీల్లో నియమించడం మూలంగా నియంతృత్వ ధోరణితో ఏకపక్షంగా కార్డులు జారీ చేస్తున్నారని అన్నారు. అలాగే ఆర్టీసీ, మెట్రోలో ప్రయాణాన్ని ఇక నుంచి పూర్తిస్థాయిలో ఉచితంగా ఇవ్వాలని కోరారు. అలాగే రైల్వే పాసులను పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రం ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సమాచార్ భవన్ దగ్గర జరిగే బహిరంగ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫెడరేషన్ శ్రేణులు, జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల సమస్యలపై నేడు ఛలో సమాచార్ భవన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



