కోడిగుడ్లకు బడ్జెట్ పెంచాలి..లేదంటే ప్రభుత్వమే సరఫరా చేయాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో వారానికి మూడు గుడ్లు పెట్టడం సాధ్యం కాదని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు వై.స్వప్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ.రమ స్పష్టం చేశారు. మంగళవారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. వారానికి రూ.18 ఇచ్చి మూడు గుడ్లు పెట్టాలని ఒత్తిడి చేయడం ఎంత వరకు సబబు? ఒక్కో గుడ్డు ధర ఎనిమిది రూపాయలన్న విషయం సర్కారుకు తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా గుడ్లకు బడ్జెట్‌ను పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే అంగన్వాడీ కేంద్రాలకు మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలలకూ రాష్ట్ర ప్రభుత్వమే గుడ్లను సరఫరా చేయాలని కోరారు. మధ్యాహ్న భోజనానికి ఉచితంగా గ్యాస్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజనంలో వారానికి మూడు గుడ్లు సాధ్యం కాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



