Wednesday, July 15, 2026
E-PAPER
Homeఖమ్మంముద్రగడ పద్మనాభానికి మున్నూరు కాపు సంఘం నివాళి

ముద్రగడ పద్మనాభానికి మున్నూరు కాపు సంఘం నివాళి

- Advertisement -

– చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నాయకులు
నవతెలంగాణ – అశ్వారావుపేట

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటని అశ్వారావుపేట మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు కురిశెట్టి నాగబాబు నాయుడు అన్నారు.  బుధవారం పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్‌ లో ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగబాబు నాయుడు మాట్లాడుతూ, కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం చెందడం బాధాకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉపాధ్యాయుల సూర్యప్రకాష్‌రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, కౌన్సిలర్లు కట్ట సింధు, దండాబత్తుల ఆదిలక్ష్మి, కొట్టే నాగసునీత, తిరుమలశెట్టి వెంకన్నబాబు, బండారు శ్రీను, వాసా ఏసుబాబు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు తిరుమలశెట్టి అప్పారావు, లక్కినేని వెంకటరమణ, దామర అయ్యప్ప (బాబి) తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -