- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
అభివృద్ధి పనుల నిమిత్తం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం రూ. 20 లక్షల నిధులను విడుదల చేశారు. మండల పరిధిలోని పెద్దతూండ్ల గ్రామానికి చెందిన మసీదు కాంపౌండ్ వాల్ కు రూ.10 లక్షలు, అలాగే గాధంపల్లె చర్చ్ కాంపౌండ్ వాల్ కి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబుకు గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం, మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు, ఉపసర్పంచ్ తాళ్ళ రవీందర్, వార్డు సభ్యుడు విష్ణువర్ధన్, అజిద్, అజారుద్దీన్ , నాగేశ్వరరావు మత పెద్దలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



