Wednesday, July 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్టీ నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే రేవూరి

పార్టీ నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే రేవూరి

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మనుషుల మధ్య మమేకమవుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం పరకాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చందుపట్ల రాఘవరెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, ఆయన తండ్రి చందుపట్ల చిన్న మల్లారెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న మల్లారెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో సైతం ఎమ్మెల్యే పాల్గొని తన నివాళులు అర్పించారు.

అదేవిధంగా, అనారోగ్యంతో బాధపడుతున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జాఫర్ రిజ్విని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఇంటికి వెళ్ళిన ఎమ్మెల్యే, రిజ్వి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య చికిత్సల గురించి ఆరా తీసి, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పార్టీ నేతలకు కష్టం వచ్చినప్పుడు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -