Wednesday, March 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏప్రిల్‌ 2న ఆసియా టెక్స్‌టైల్‌ కాన్ఫరెన్స్‌

ఏప్రిల్‌ 2న ఆసియా టెక్స్‌టైల్‌ కాన్ఫరెన్స్‌

- Advertisement -

బ్రోచర్‌ ఆవిష్కరించిన మంత్రులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ఆసియన్‌ టెక్స్‌టైల్‌ 13వ కాన్ఫరెన్స్‌ (అటెక్స్‌కాన్‌-2026)ను ఈ ఏడాది ఏప్రిల్‌ 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన ‘రీ ఇమేజినింగ్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ గ్లోబల్‌ టెక్స్‌టైల్స్‌’ బ్రోచర్‌ను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెక్స్‌టైల్‌ రంగంలో రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరిగే కాన్ఫరెన్స్‌లో దేశీయ-అంతర్జాతీయ టెక్స్‌టైల్‌ పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, నిపుణులు ఒకే వేదికపైకి రావడం ద్వారా ఆ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు. ఈ అంతర్జాతీయ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ టెక్స్‌టైల్‌ ఇండిస్టీ భాగస్వామ్యంతో నిర్వహిస్తుందని చెప్పారు. టెక్స్‌టైల్‌ రంగంలో సుస్థిరాభివృద్ధి, సాంకేతికత, సరఫరా వ్యవస్థలు, గ్లోబల్‌ మార్కెట్ల అవకాశాలు వంటి పలు అంశాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్‌ 4న వరంగల్‌లోని పీఎమ్‌ మిత్ర పార్క్‌లో పరిశ్రమల సందర్శన ఉంటుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -