Thursday, July 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంత్వరలో మెట్రో అదనపు బోగీలు

త్వరలో మెట్రో అదనపు బోగీలు

- Advertisement -

పెరగనున్న చివరి మైలు అనుసంధానం
ప్రతి స్టేషన్‌కూ ప్రత్యేక ప్రణాళిక
హైదరాబాద్ మెట్రో రైల్ అభివృద్ధిపై అదనపు ఎండీ అజిత్ రెడ్డి సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో

భాగ్యనగర వాసులకు మెట్రో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు, అదనపు బోగీల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని హెచ్‌ఎం ఆర్‌ఎల్‌ అదనపు మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌బి.అజిత్‌‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో రైల్ అభివృద్ధి, ప్రస్తుత కారిడార్ల నిర్వహణపై బుధవారం ఉన్నతాధి కారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. మెట్రో భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్‌తో కలిసి ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం నడుస్తున్న 69 కిలోమీటర్ల మెట్రో కారిడార్లలో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, అదనపు బోగీల కోసం రైలు తయారీ సంస్థలతో చర్చలు జరిపి, త్వరితగతిన సమకూర్చుకోవాలని సూచిం చారు. ప్రయాణీకుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సేవల నాణ్యతను పెంచాలని అదనపు మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ స్పష్టం చేశారు.

లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సమన్వ యం చేసుకోవాలని చెప్పారు. ఇప్పటికే ఉన్న వాహన సదుపాయాలను మరింత విస్తరించడంతో పాటు, ప్రయాణీ కులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ప్రత్యేక రవాణా సౌకర్యాలను అందు బాటులోకి తేవాలని అన్నారు.
మెట్రో స్టేషన్లను రైల్వే స్టేషన్లతో అనుసంధానించే స్కై వాక్‌ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన చోట వాటిని విస్తరించాలని ఆదేశించారు. ఇందుకోసం రైల్వే అధికారులతో కలిసి పని చేయాలని సూచించారు. ప్రతి మెట్రో స్టేషన్‌కూ ఒక స్థానిక ప్రణాళిక ఉండాలని, ప్రయోగాత్మకంగా కొన్ని స్టేషన్లలో దీనిని అమలు చేసి, అనంతరం అన్ని స్టేషన్లకూ విస్తరించాలని చెప్పారు. స్టేషన్లలో టికెటింగ్ ప్రక్రియను మరింత సరళతరం చేసి ప్రయా ణీకులు గందరగోళానికి గురికా కుండా చూడాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో పర్యటనలు
మెట్రో స్టేషన్ల పనితీరు, నిర్వహణను స్వయంగా పర్యవేక్షించడానికి త్వరలోనే తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని అజిత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా హైటెక్ సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ ప్రాంతాల్లో ప్రతిపా దించిన పీఆర్ టీఎస్ రవాణా వ్యవస్థ ప్రగతిని ఆయన సమీక్షించారు. స్టేషన్లలో భద్రత, శుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను హెచ్చ రించారు. ఈ సమావేశంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డి.వి.ఎస్ రాజు, చీఫ్ సిగ్నలింగ్ ఇంజినీర్ స్వపన్ కుమార్ దాస్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్‌ విష్ణువర్ధన్ రెడ్డి, చీఫ్ ఇం జినీర్ సాయపరెడ్డి, జనరల్‌ ‌మేనేజర్‌ (‌సెక్యూరిటీ) శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -