Thursday, July 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ పాఠశాలల బలోపేతం

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం

- Advertisement -

కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం
ప్రాథమిక స్థాయి నుంచే శాస్త్రీయ 
దృక్పథం అవసరం :మంత్రి డి.శ్రీధర్ బాబు
అల్వాల్‌లో ‘ఎఫ్‌డీఆర్’ సైన్స్ సెంటర్‌ ప్రారంభం
నవతెలంగాణ-అల్వాల్

ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ సైన్స్ సెంటర్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఎఫ్‌‌డీఆర్‌ వ్యవస్థాపకులు, లోక్‌సత్తా అధినేత డా. జయప్రకాష్ నారాయణతో కలిసి మంత్రి ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలో సృజనాత్మకతను పెంపొందించడమే తమ ప్రథమ లక్ష్యమని అన్నారు. విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఇలాంటి అత్యాధునిక సైన్స్ సెంటర్లు ఎంతో దోహదపడతాయన్నారు. అధికారులతో కలిసి పాఠశాలలోని నూతన ల్యాబ్ పరికరాలను పరిశీలించిన మంత్రి.. విద్యార్థినులతో కాసేపు ముచ్చటించి, వారి ఆవిష్కరణలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్యామ్ ప్రకాష్ , అల్వాల్ మండల తహసీల్దార్ రాములు, జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఉపాధ్యాయులు, మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -