Thursday, July 16, 2026
E-PAPER
Homeక్రైమ్హత్య కేసును ఛేదించిన పోలీసులు

హత్య కేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -

ఇద్దరు నిందితుల అరెస్ట్‌
నవతెలంగాణ-మిర్యాలగూడటౌన్‌

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపూర్ గ్రామంలో ఈనెల 11వ తేదీన జరిగిన ఇస్లావత్ ‌గోవిందుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతని భార్యతోపాటు మరో నిందితున్ని అరెస్టు చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని పోలీస్‌‌స్టేషనల్‌‌లో బుధవారం ‌విలేకర్ల సమావేశంలో సీఐ పిఎన్‌‌డి.ప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. నర్సాపూర్‌ ‌గ్రామానికి చెందిన ఇస్లావత్ సరోజ, గోవిందుడు(53) భార్యాభర్తలు. అయితే, అదే గ్రామానికి చెందిన ఇస్లావత్ శ్రీనుతో సరోజకు వివాహేతర సంబంధం కొనసాగుతోంది. గోవిందుడి కుటుంబానికి, వారి కుమార్తెల వివాహానికి శ్రీను ఆర్థికసాయం కూడా చేశాడు. కొన్నాళ్ల తర్వాత తన భార్యకు శ్రీనుతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం గోవిందుడిలో కలగడంతో భార్యాభర్తల
మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శ్రీను, సరోజ కలిసి గోవిందుడిని హత్య చేయాలని ప్లాన్‌ ‌వేశారు. ఈనెల 11న అర్ధరాత్రి శ్రీను గోవిందుడి ఇంట్లోకి ప్రవేశించి అతని మొఖంపై దిండు అదిమి పెట్టగా.. సరోజ చెక్కతో భర్త మర్మాంగాలపై బలంగా కొట్టింది. దీంతో గోవిందుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత హత్యకు ఉపయోగించిన వస్తవులను, సెల్‌‌ఫోన్లను దాచిపెట్టి ఇద్దరూ పరారయ్యారు. నిందితులను ఈనెల 14న రైల్వేగేట్‌ ‌సమీపంలో పోలీసులు అరెస్టు చేసి విచారించగా నేరం ఒప్పుకున్నారు. కేసును ఛేదించిన వారిలో మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌‌రెడ్డి, పోలీస్‌‌స్టేషన్‌ ‌సిబ్బంది జహీరోద్దీన్‌, జోజి, హరినాథ్‌, మధు, ఉదయ్‌, పూర్ణిమ, చౌడమ్మ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -