ఉద్యోగ భద్రత కల్పించాలి:
సర్వేయర్స్ అసోషియేషన్ డిమాండ్
గద్వాల కలెక్టరేట్ ఎదుట ఆందోళన
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
లైసెన్స్ సర్వేయర్లకు వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్స్ అసోషియేన్ డిమాండ్ చేసింది. బుధవారం జోగులాంబ గద్వాల కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం అసోషియేషన్ ప్రతినిధులు అదనపు కలెక్టర్ మధుమోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోషియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన శిక్షణలో అర్హత సాధించి లైసెన్స్ పొందినప్పటికీ, తగిన పని కల్పించడంలేదని, దానితో స్థిరమైన ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అప్పగించే సర్వే పనుల ద్వారానే జీవనోపాధి పొందుతున్నామన్నారు. ప్రస్తుతం ఎకరం భూమి సర్వే చేస్తే కేవలం రూ.50 మాత్రమే వేతనం నిర్ణయించబడిందన్నారు. తక్కువ వేతనాలు ఇస్తుండడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణ, ఫీల్డ్ ఖర్చులకు కూడా సరిపోవడంలేదన్నారు. సాంకేతిక సమస్యల మధ్య సర్వే పనులు సాఫీగా సాగడంలేదన్నారు. జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు సరిపోవడం లేదన్నారు. సర్వేయర్ల పరిస్థితిని సానుకూలంగా పరిశీలించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రతి నెలా సర్వేకు కనీస ఫీజుగా రూ.30వేలు వేతనంగా నిర్ణయించాలని కోరారు. ఫీల్డ్ డ్యూటీలో ప్రమాద బీమా, ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. టీఏ, డీఏ, ప్రయాణ భత్యాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టెక్నికల్ సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. లైసెన్స్ సర్వేయర్లకు ప్రభుత్వ గుర్తింపు కార్డులివ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు సర్వేయర్లు పాల్గొన్నారు.
లైసెన్స్ సర్వేయర్లకు వేతనాలు పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



