Wednesday, March 11, 2026
E-PAPER
Homeకరీంనగర్వైభవంగా ఎద్దుగుట్ట మల్లన్న స్వామి కళ్యాణోత్సవం

వైభవంగా ఎద్దుగుట్ట మల్లన్న స్వామి కళ్యాణోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్లలోని ఎనిమిదవ వార్డులో ఎద్దుగుట్ట మల్లన్న స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఎద్దుగుట్టపై పెద్ద పట్నం వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పాల్గొని మాట్లాడుతూ భక్తుల ఆరాధ్య దైవం  పెద్ద గుట్ట మల్లన్న స్వామి  కళ్యాణ మహోత్సవం లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని,  మల్లన్న స్వామి కృపతో ప్రజలందరు  సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో సంతోషకరమైన జీవితం గడపాలని పాడిపంటలు వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధించాలని ఆ మల్లన్న స్వామిని కోరానని అన్నారు.

అనంతరం స్వామి నాగవల్లి పట్నం ను వీక్షించి అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించారు. ఎద్దుగుట్ట మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో కౌన్సిలర్  లింగంపల్లి భాగ్యలక్ష్మి, సత్యనారాయణ , దొంతినేని కళ్యాణి, అశోక్ రావు , దార్నం అరుణ, లక్ష్మీనారాయణ , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి , మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ , మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్ , లింగంపల్లి సత్యనారాయణ , భూక్య రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -