నవతెలంగాణ-మద్నూర
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడత విజయవంతంగా పూర్తైన సంగతి తెలిసిందే. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషితో ఇండ్లు లేని నిరుపేదలు సొంతింటి కలను సాకారం చేసుకున్నారు. ఇక ఇప్పుడు రెండో విడత పనులు కూడా గురువారం మండల పరిధిలోని చిన్న తడుగూర్ గ్రామంలో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామ సర్పంచ్ సూర్య వంశీ ప్రకాష్ లబ్దిదారుల ఇండ్లకు ముగ్గు పోసి మార్కౌట్ లు గీశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మొదటి విడతలో అర్హులైన లబ్దిదారులకు మంజూరు కాని వారికి రెండో విడతలో తప్పకుండా అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని లబ్దిదారులందరూ వినియోగించుకోవాని పేర్కొన్నారు. కార్యక్రమాలలో ఆ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు మాధవరావు పటేల్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.
మొదలైన రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



