నవతెలంగాణ – ముధోల్
ఎస్ఐఆర్ ఓటరు సర్వే వందశాతం పూర్తికి కృషి చేసిన ముధోల్ మండలంలోని చించాల, వెంకటాపురం సర్పంచులు సర్వేష్, శ్రావణి గంగశేఖర్ లను గురువారం ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఘనంగా సన్మానించారు. గ్రామాలలోని ఓటర్లను చైతన్యవంతం చేసి, అధికారుల సహకారంతో ఎస్ఐఆర్ ను పూర్తి చేసినందుకు సర్పంచులను ఆయన అభినందించారు. ఇదే మాదిరిగా మిగితా గ్రామాల్లో కూడా వందశాతం పూర్తి చేయడానికి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఈ సందర్బంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోమాజీ పిఎసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాపేవార్ కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీలు పోతన్న యాదవ్, నాయకులు అఫ్రోజ్ ఖాన్, బషిర్ ,సాయినాథ్, గౌతమ్, సత్యనారాయణ , శ్రీనివాస్ గౌడ్, మగ్ధుమ్ , విఠల్ ,వంశీ,రవి, భోజేందర్, ఉత్తమ్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ సర్వే 100 శాతం పూర్తికి కృషి చేసిన సర్పంచులకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



