- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
బాసర సరస్వతి అమ్మవారిని బాలాలయంలో తెలంగాణ ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ఫోటో, ప్రసాదాన్ని అందజేశారు. ఈయన వెంట కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, నీలాదేవి, తదితరులు ఉన్నారు.
- Advertisement -



