Thursday, July 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

- Advertisement -

పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన రాజపుత్ర వెంకటేశ్వర్ విద్యుత్ షాక్‌కు గురై అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ గురువారం మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యం నింపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ఎక్స్‌గ్రేషియా (పరిహారం)తో పాటు ఇతర ఆర్థిక సహాయాలు వీలైనంత త్వరగా అందేలా సంబంధిత అధికారులతో మాట్లాడి పూర్తి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

మృతుడి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. ఎమ్మెల్యే తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు కట్ట అనంతరెడ్డి, ఉప్పునుంతల సర్పంచి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాత్లావత్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -