చైర్‌పర్సన్ డా. సంధ్యారాణితో మర్యాదపూర్వక భేటీ\
నవతెలంగాణ – రామకృష్ణాపూర్
పురపాలక సంఘ నూతన కమిషనర్‌గా ఎన్. మురళీకృష్ణ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ సంధ్యారాణిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ డా. సంధ్యారాణి మాట్లాడుతూ.. గతంలో జరిగిన విషయాలను పక్కనపెట్టి ఇకపై ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బందిని కలుపుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. అలాగే రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులను సమాన దృష్టితో అభివృద్ధి చేయాలని, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్‌కు సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శక పాలన అందించాలని ఆకాంక్షించారు. నూతన కమిషనర్ మురళీకృష్ణ కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తూ పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్‌గా ఎన్. మురళీకృష్ణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



