Friday, July 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో హైదరాబాద్‌ యువకుడిపై కత్తితో దాడి

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడిపై కత్తితో దాడి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలోని యుటా రాష్ట్రంలో హైదరాబాద్‌లోని టోలీచౌకికి చెందిన సోహైల్‌ ఉద్దీన్‌(38)పై ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు. బాధితుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన సోహైల్‌.. భార్య, ఇద్దరు పిల్లలతో రెండేళ్లుగా యుటా రాష్ట్రంలోని సాల్ట్‌లేక్‌ కౌంటీలో నివాసముంటున్నారు. వెస్ట్‌వ్యాలీ సిటీలోని ఓ మాల్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 14న విధుల్లో ఉన్న సమయంలో మాల్‌కు వచ్చిన ఓ దుండగుడు ‘నువ్వు ఇండియన్‌వే కదా’ అంటూ విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. స్థానికులు సోహైల్‌ను రక్షించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు నిందితుడిని పట్టుకొని అరెస్టు చేశారు. టోలిచౌకిలోని సోహైల్‌ ఇంట్లో అతని తల్లి మాత్రమే ఉంటున్నారు. ఈ ఘటనపై  అధికారులు, బాధితుడి  కుటుంబీకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత కాన్సులేట్‌ పేర్కొంది. మైనారిటీలపై ఎక్కడపడితే అక్కడ దాడులు జరుగుతున్నాయని మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. బాధిత యువకుడి వద్దకు కుటుంబసభ్యులు చేరుకునేందుకు అత్యవసర వీసా మంజూరు చేయించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు మజ్లిస్‌ బచావో తెహ్రీక్‌ అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -