Thursday, September 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధాన్ని ముగించండి

యుద్ధాన్ని ముగించండి

- Advertisement -

ట్రంప్‌ను ఆదేశిస్తూ ప్రతినిధులసభ తీర్మానం
అనుకూలంగా ఓటేసిన ఏడుగురు రిపబ్లికన్లు


వాషింగ్టన్‌
: ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధాన్ని ఆపేయాలంటూ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఆదేశించే తీర్మానాన్ని ప్రతినిధులసభ మంగళవారం ఆమోదించింది. ఇరాన్‌ నుంచి సైన్యాన్ని ఉపసంహరించాలని ట్రంప్‌ను కోరుతూ ప్రతినిధులసభ తీర్మానం చేయడం ఇది మూడోసారి. ఈ తీర్మానాన్ని ప్రతిపక్ష డెమొక్రాట్లతో పాటు అధికార రిపబ్లికన్లతో కొందరు సమర్ధించారు. మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది చివరి ఓటింగ్‌ అని, అందుకే దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నదని డెమొక్రాట్లు తెలిపారు. గతంలో ప్రవేశపెట్టిన తీర్మానాలకు నలుగురు రిపబ్లికన్లు మద్దతు ఇవ్వగా ఇప్పుడు ఆ సంఖ్య ఏడుకు పెరిగింది. ‘మరో నిరవధిక యుద్ధానికి నేను మద్దతు ఇవ్వను. తన రాజ్యాంగ బాధ్యతలను కాంగ్రెస్‌ నెరవేర్చేలా చూసుకుంటూనే మనం అమెరికన్లను రక్షించుకోవచ్చు. ఇరాన్‌పై ఒత్తిడి తేవచ్చు. శాంతిని సాధించవచ్చు’ అని రిపబ్లికన్‌ సభ్యుడు జాన్‌ నన్‌ చెప్పారు. కాగా తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్న రిపబ్లికన్‌ సభ్యులపై ట్రంప్‌ మండిపడుతున్నారు. ఏదేమైనా ఇరాన్‌లో ట్రంప్‌ సైనిక అధికారాలను కట్టడి చేసేందుకు కాంగ్రెస్‌ చేసిన చివరి ప్రయత్నం నాటకీయంగా ముగిసింది. తీర్మానానికి తొలుత సెనెట్‌లోని కొందరు రిపబ్లికన్‌ సభ్యులు మద్దతు పలికారు. అయితే అధ్యక్షభవనం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఓ సెనెటర్‌ మనసు మార్చుకొని వ్యతిరేకంగా ఓటేశారు. తీర్మానాన్ని మరోసారి ఆమోదించడానికి సెనెట్‌కు తగినన్ని ఓట్లు ఉంటాయో లేదో తెలియడం లేదు. అయితే డెమొక్రాట్లు మాత్రం ఈ వారం చివరలో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -