Thursday, September 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌కు భారీ ఆయుధ ప్యాకేజీ

ఇజ్రాయిల్‌కు భారీ ఆయుధ ప్యాకేజీ

- Advertisement -

40,000 బాంబులు…2.8 బిలియన్‌ డాలర్లు అ
గ్నికి ఆజ్యం పోస్తున్న అమెరికా

బైడెన్‌ నిలిపివేసిన సరఫరాలకు ట్రంప్‌ గ్రీన్‌సిగల్‌

వాషింగ్టన్‌ : గాజాలో మారణకాండ సృష్టిస్తూ వేలాది మంది పాలస్తీనియన్ల ప్రాణాలను బలిగొంటున్న ఇజ్రాయిల్‌కు భారీ ఆయుధ ప్యాకేజీ ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యోచిస్తున్నారు. గతంలో బైడెన్‌ ప్రభుత్వం అటకెక్కించిన ఆయుధ సరఫరా ప్యాకేజీని ఇప్పుడు పట్టాల పైకి ఎక్కించాలని ఆయన భావిస్తున్నారు. 2.8 బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన ఈ ప్యాకేజీలో ఒక్కొక్కటి 907 కిలోల బరువున్న 40,000 శక్తివంతమైన బాంబులు, ఆయుధాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇజ్రాయిల్‌కు అమెరికా ఇంత పెద్ద మొత్తంలో బాంబులు, ఆయుధాలు విక్రయిం చడం ఇదే మొదటిసారి.

పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో…
అమెరికా అధికారుల సమాచారం ప్రకారం…ఈ ప్యాకేజీలో 20,000 ఎంకే-84 సాధారణ రకం బాంబులు, 20,000 బీఎల్‌యూ-117 రకం బాంబులు (నౌకాదళం నిల్వ చేసేందుకు అనుకూలం) ఉన్నాయి. వీటితో పాటు భూగర్భ బంకర్లను ధ్వంసం చేసే 20,000ఐ-2000 పెనెట్రేటర్‌ వార్‌హెడ్‌లు కూడా ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. ఆయుధాల కొనుగోలుకు అయ్యే వ్యయాన్ని అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధుల ద్వారా ఇజ్రాయిల్‌కు గ్రాంటుగా అందజేస్తారు. అంటే అమెరికా ఇచ్చిన సొమ్ముతోనే, అమెరికా నుంచే ఇజ్రాయిల్‌ ఈ ఆయుధాలను కొనుగోలు చేస్తుందన్న మాట. రెండు వేల పౌండ్ల (907 కిలోలు) బాంబులు ఎంతటి శక్తివంతమైనవి అంటే ఇవి ఒకేసారి పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాలను, భూగర్భ టన్నెల్స్‌ను నేలమట్టం చేస్తాయి. జనావాస ప్రాంతాలలో వీటిని వాడితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని మానవ హక్కుల సంఘాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా ప్యాకేజీ ఇంకా ఖరారు కాలేదని, ప్రతిపాదిత అమ్మకంపై కాంగ్రెస్‌ కమిటీలకు అనధికారికంగా సమాచారం ఇవ్వడం జరిగిందని అధికారులు తెలిపారు.

ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదానికి వేలాది మంది ఆహుతి
2003 అక్టోబరులో దక్షిణ ఇజ్రాయిల్‌పై హమాస్‌ దాడి చేయడంతో గాజాపై ఇజ్రాయిల్‌ సైనిక చర్యను ప్రారంభించింది. ఈ సైనిక చర్యలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఆహరం, వైద్యం, ఇతర మానవతా సాయం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో యుద్ధాన్ని నిలిపివేయాలని, కాల్పుల విరమణ పాటించాలని పలు దేశాలు, సంస్థలు కోరుతున్నాయి. గత సంవత్సరం అక్టోబరులో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం సడలలేదు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 900 మందికి పైగా పాలస్తీనియన్లు ఇజ్రాయిల్‌ దాడులలో మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే ఇజ్రాయిల్‌ మారణకాండకు 73,700 మందికి పైగా బలయ్యారు.

వరుస ప్యాకేజీలతో సాయం
ఇజ్రాయిల్‌కు ఆయుధ ప్యాకేజీ ఇస్తే గాజాలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతుందన్న ఆందోళనతో గతంలో బైడెన్‌ ప్రభుత్వం ఎంకే-84 బాంబుల సరఫరాను నిలిపివేసింది. అయితే ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయిల్‌పై ఆంక్షలను ఎత్తివేశారు. గత సంవత్సరం కాంగ్రెస్‌ సమీక్షా ప్రక్రియను కాదని ఇజ్రాయిల్‌తో సుమారు మూడు బిలియన్‌ డాలర్ల ఆయుధ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఏడాది జనవరిలో 6.67 బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన మరో ఆయుధ ఒప్పందానికి ట్రంప్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ అతి పెద్ద ఆయుధ ఒప్పందానికి సంబంధించిన సమాచారాన్ని కాంగ్రెస్‌ కమిటీలకు నివేదించారు.

అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేకత
గాజాలో హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టడానికి, అక్కడ మిగిలి ఉన్న 20 లక్షల మంది పాలస్తీనియన్లను ఖాళీ చేయించడానికి తమ సైన్యం సంపూర్ణ యుద్దానికి సిద్ధంగా ఉన్నదని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ ఇటీవలే ప్రకటించారు. ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా ధ్వంసమైన శిథిలాల కింద నుంచి ఇప్పటికీ వందలాది మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. గాజాలో అంత ర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘన, యుద్ధ నేరాలు జరుగు తున్నాయని ఐరాస చీఫ్‌ వోల్కర్‌ టర్క్‌ చెప్పారు. గాజా యుద్ధం మొద లైన తర్వాత అమెరికా ప్రజలలో ఇజ్రాయిల్‌కు మద్దతు తగ్గిపోతోంది. ఇజ్రా యిల్‌కు అవస రానికి మించి అమెరికా సాయం చేస్తోందని జూన్‌లో జరిగిన ఓ సర్వేలో 48 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -