– మోడీకి పేరొస్తుందనే పథకాలను అడ్డుకుంటున్నారు
– బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు
– జిల్లా కార్యవర్గ సమావేశంలో శ్రేణులకు దిశా నిర్దేశం
నవతెలంగాణ-నెల్లికుదురు : ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా సమస్యలపై గళమెత్తుతూ నిరంతరం జనంతో ముందుకు పోవాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెమరు కొమ్ముల గౌతం రావు అన్నారు. మండల కేంద్రం లో ని అమూల్య గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు అధ్యక్షతన గురువారం జిల్లా కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ పతాకా విష్కరణ చేశారు. పార్టీ నాయకులు సింగారం సతీష్,వద్దిరాజు రామచంద్రరావు,పొదిల నరసింహారెడ్డి,చిలుపూరి వెంకన్న,గడ్డం అశోక్,నల్లాని పాపారావు,లింగాల సుధీర్ రెడ్డి,ఇందు భారతి,మదన్ లాల్ ప్రభృతులలో కొందరు రాజకీయ తీర్మానాలు చేయగా కొందరు సమర్థించారు. అనంతరం గౌతమ్ రావు జిల్లాలోని 16 మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులను పార్టీ పూర్వ అభివృద్ధిపై అడిగి తెలుసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ అర్హులకు చెందేలా చూడాలన్నారు. పార్టీ ఆజ్ఞాపించిన విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటూ తూచా తప్పకుండా అమలు చేయాలంటూ కార్యవర్గ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల నాయకులు కళ్యాణ్ నాయక్, మహేష్ గౌడ్, చందు రాజ్ కుమార్ యాదవ్,పర్నె ప్రభాకర్ రెడ్డి,హిందుభారతి,డా.అశోక్, మని చందన,రాసయాకిరెడ్డి,బాదావత్ సురేష్ నాయక్, దుంపల సందీప్,తోట రమేష్, ముస్తఫా, జిల్లా కార్యవర్గ సభ్యులు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


