నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం
నవతెలంగాణ- వెల్దండ
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసు కుంది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలోని వెల్దండ మండల పరిధిలోని పోతేపల్లి గ్రామంలో శుక్రవారం జరి గింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎను ముల శిరీష(23), మహేష్ దం పతులు. వారికి కుమార్తె మానశ్రీ(3), కుమారుడు వర్షిత్ (4 నెలలు) సంతానం. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆవరణలో ఉన్న నీటి సంపులో ఇద్దరు పిల్లలను పడేసి.. ఆపై శిరీష కూడా అందులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పొలానికి వెళ్లిన మహేష్, అత్తమామలు సాయంత్రం ఇంటికి వచ్చేసరికే ఎవరూ కనిపించలేదు. ఇంటి ఆవరణలోని నీటి సంపు మూత తెరిచి ఉండటంతో.. లోపలికి చూడగా ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



