Saturday, July 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నానోతో.. లాభాలెన్నో.!

నానోతో.. లాభాలెన్నో.!

- Advertisement -

తక్కువ పెట్టుబడితో దిగుబడులు పొందే అవకాశం
నవతెలంగాణ – మల్హర్ రావు

పంటల సాగులో ఆధునికవ్యవసాయ పద్ధతులు పాటిస్తే రైతులు పెట్టు బడులు తగ్గించుకుని ఆశించిన పంట దిగుబడులు పొందే అవకాశాలు ఉంటాయి. అందులో భాగంగా నానో ఎరువుల వినియోగంతో కలిగే ప్రయోజనాలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగా హన కల్పిస్తున్నారు. పంటల దిగుబడులే కాకుండా భూసారం ఎలా కాపాడుకోవాలి .?అందుకు సాగులో చేసుకోవాల్సిన మార్పులపై వ్యవసాయ అధికారులు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. సాధారణ డీఏపీ, యూరియా బస్తాలు పంట మొక్కలకు చల్లితే కలిగే ప్రయోజనాలతో పోల్చు కుంటే నానో లిక్విడ్ ఎరువులతో ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు.

ఇవీ ప్రయోజనాలు..
సాధారణ డీఏపీ, యూరియా బస్తాల లభ్యం కంటే నానో డీఏపీ,యూరియా రైతులు సులభంగా పొందవచ్చు. బస్తా ఎరువులు చేలల్లో చల్లితే మొక్కలకు 30 శాతం నుంచి 40 శాతం వరకే ఉపయోగపడ తాయని అధికారులు చెబుతున్నారు. అదే నానో లిక్విడ్ ఎరువులు పంట మొక్కలకు పిచికారీ చేస్తే 70 శాతం నుంచి 80 శాతం మొక్కలకు చేరి ప్రయోజనం కలుగుతుందన్నారు. మరోవైపు బస్తా ఎరువులు పొలాలకు తరలిచడం చల్లించడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటోంది. నానో డీఏపీ, యూరియాలను పొలాలకు తరలించడం,పిచికారీ చేయడం సులభం. అందుకు ఖర్చు కూడా తక్కువే. ప్రభుత్వ సబ్సిడీ పోను ఒక్కో డీఏపీ బస్తా ధర రూ.1,350, యూరియా బస్తా ధర రూ.266గా ఉంది. అర లీటర్ నానో డీఏపీ,యూరియా ఒక్కో బస్తా డీఏపీ యూరియాతో సమానంగా పంటలకు పనిచేస్తుంది. రైతుల్లో మరింత అవగాహన పెంచితే నానో ఎరువుల వినియోగంపై రైతులు ఎక్కువ దృష్టి సారించే అవకాశాలున్నాయి.

నానోతో అధిక ప్రయోజనాలు: శ్రీజ, మండల వ్యవసాయాధికార
సాధారణ డీఏపీ, యూరియా ఎరువుల విని యోగంతో పూర్తిస్థాయిలో పోషకాలు మొక్కలకు అందకపోగా రైతుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. భూసారం దెబ్బతింటోంది. నానో ఎరువుల వినియోగంతో నత్రజని, భాస్వరం పోష కాలు 80 శాతం మొక్కలకు చేరుతాయి. నానో ఎరువుల ప్రయోజనాలపై రైతులకు ఉన్న సం దేహాలను తీర్చుతున్నాం. పలువురు రైతులు నానో ఎరువుల వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -