ఉప సర్పంచ్ సాయికుమార్, మాజీ సర్పంచ్ రాజ్ రెడ్డి
నవతెలంగాణ – మిరుదొడ్డి
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు కృషి చేస్తున్న శ్రీ అనంతరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అధినేత మాధవరెడ్డి సేవలు అభినందనీయమని ఉప సర్పంచ్ సాయికుమార్, మాజీ సర్పంచ్ గుర్రప్పగారి రాజిరెడ్డి, ట్రస్ట్ డైరెక్టర్ పోల్ రెడ్డి దిలీప్ రెడ్డి లు అన్నారు. మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలోయుని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు గుర్రప్పగారి మాధవ రెడ్డి సహకారంతో స్పోర్ట్స్ డ్రెస్, షూస్, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్, ఐడి కార్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గత నాలుగు సంవత్సరాలుగా మాధవరెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతోపాటు పౌష్టికాహారం అందించేలా కృషి చేయడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తన వంతు సహకారం అందిస్తూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయడం ఆదర్శప్రాయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



