Sunday, July 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూత్ డిక్లరేషన్ హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి

యూత్ డిక్లరేషన్ హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి

- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ డివిజన్ యువ నాయకుడు బానోతు రాజ్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ హామీలపై స్వేతపత్రం విడుదల చేయాలని మంథని నియోజకవర్గ బిఆర్ఎస్ యువ నాయకుడు బానోతు రాజ్ కుమార్(ఢిల్లీరాజు) శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ యువతకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అమలు చేయడం లేదని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో యువత తగిన బుద్ది చెప్తారన్నారు. పేరుకే ప్రజాపాలనని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -