Tuesday, July 21, 2026
E-PAPER
Homeఖమ్మంగంగారం ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన సదుపాయాలు కల్పించాలి

గంగారం ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన సదుపాయాలు కల్పించాలి

- Advertisement -

– ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి,
– వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ డిమాండ్
– వైద్యశాలలో సర్వే నిర్వహించిన ఐద్వా, వ్యకాస బృందం
నవతెలంగాణ-సత్తుపల్లి

సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన సదుపాయాలు కల్పించి రోగులను ఆదుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఐద్వా, వ్యకాస బృందం గంగారం ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి, అక్కడ ఉన్న సమస్యలను రోగులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్తుపల్లి రూరల్, అర్బన్ పరిధిలో సుమారు 77 వేల జనాభా ఈ గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపైనే ఆధారపడి ఉందన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రికి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించడానికి వెంటనే ఒక అంబులెన్స్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ​ఈ హాస్పిటల్ 2000 సంవత్సరంలో ప్రారంభమైన నాటినుంచి ఇప్పటి వరకు అటెండర్, స్వీపర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులను నియమించకపోవడం శోచనీయమన్నారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ కూడా సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. హాస్పటల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల మహిళా డాక్టర్లు, నర్సులు గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు సమావేశాలు నిర్వహించేందుకు నిర్మించిన ప్రత్యేక మీటింగ్ హాల్ నిర్మాణం పూర్తయినప్పటికీ, ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు.

​రోగులకు, వైద్య సిబ్బందికి అవసరమైన ఫర్నిచర్, ఫ్యాన్లు తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఆసుపత్రి మెయిన్ గేట్ ముందు డ్రైనేజీ  పగిలిపోవడం వలన నిత్యం పాదచారులకు, వాహనదారులకు తీవ్ర ప్రమాదకరంగా మారిందని, దీనిని వెంటనే బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు, సీఐటీయూ మండల కన్వీనర్ కావూరి వెంకటేశ్వరరావు, నాయకులు దాట్ల రాంబాబు, బెజవాడ లక్ష్మీనారాయణ, వెంకటలక్ష్మి, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -