Monday, July 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూకబ్జాదారుకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ యంత్రాంగం.?

భూకబ్జాదారుకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ యంత్రాంగం.?

- Advertisement -

కలెక్టర్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు 
నవతెలంగాణ – పరకాల

పరకాల మండలం లక్ష్మీపురంలో వెలుగుచూసిన భూదందా వ్యవహారం రెవెన్యూ యంత్రాంగం పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తోంది. సర్వే నంబర్లు 371, 359లోని భూమి ప్రభుత్వానిదేనని రెవెన్యూ అధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధారించినా, దానిని స్వాధీనం చేసుకోవడంలో జాప్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభుత్వ భూమిని తన సొంత ఆస్తిగా చూపించి, అమాయక సంచార తెగకి చెందిన (గంగిరెద్దుల) వారి నుంచి సదరు వ్యక్తి (మోతెబరి) లక్షల రూపాయలు వసూలు చేశారు. విచారణలో అక్రమం అని తేలినప్పటికీ, భూమిని స్వాధీనం చేసుకుని హద్దులు నిర్ణయించకపోవడం, ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.

అక్రమ విక్రయాలు జరిగి ఏండ్లు గడుస్తున్నా, ప్రభుత్వం స్పందించకపోవడంతో రెవెన్యూ అధికారులు అక్రమ భూ కబ్జాదారుడికి వంత పాడుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని, అమాయకులను మోసం చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం పై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -