Sunday, August 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మద్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్, బోటోనీ, జూవలాజి, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 21న (మంగళవారం) లోగా కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఉద్యోగార్థులు సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులు అర్హత, పీహెచ్డీ/ సెట్/ నెట్ ఉద్యోగ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. జూలై 22న (బుధవారం) ఉదయం 10 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డిలో డెమో, ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -