Saturday, September 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిరుత పులి కళేబరానికి అంతక్రియలు

చిరుత పులి కళేబరానికి అంతక్రియలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని అటవీ రేంజ్ కార్యాలయం ఆవరణలో ఆదివారం సాయంత్రం చిరుత పులి కళేబరానికి అంతక్రియలు పూర్తి చేశారు. ఈనెల 12వ తేదీన భీంగల్ మండలం తాళ్లపల్లి అటవీ ప్రాంతంలో లభ్యమైన చిరుత పులి కళేబరాన్ని కమ్మర్ పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పటినుండి రేంజ్ కార్యాలయంలోనే భద్రపరిచిన చిరుత పులి కళేబరానికి కోర్టు ఆదేశాల మేరకు అంత్యక్రియలు నిర్వహించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి సిద్ధార్థ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -