Tuesday, July 21, 2026
E-PAPER
Homeఆటలుమెరిసిన అశ్వత్, వేద

మెరిసిన అశ్వత్, వేద

- Advertisement -

రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు
నవతెలంగాణ- హైదరాబాద్
: రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన అశ్వత్ అయ్యలసోమయజుల, వేద ఆశ్రిత డబుల్ ధమాకా సాధించారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో బాలుర విభాగంలో అశ్వత్ రెండు పసిడి పతకాలను సాధించాడు. 100 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో, 50 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. బాలికల విభాగంలో వేద ఆశ్రిత 100మీటర్ల, 50 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో పసిడి పతకాలు సొంతం చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -