Tuesday, July 21, 2026
E-PAPER
Homeసినిమాపాన్ ఇండియా స్థాయిలో..

పాన్ ఇండియా స్థాయిలో..

- Advertisement -

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘రౌడీ జనార్థన. దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతోంది. సోమవారం డైరెక్టర్ రవికిరణ్ కోలా పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలను మూవీ టీమ్ తెలిసింది. అలాగే సినిమా సెట్స్ నుంచి ఆయన వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు. ఈ లేటెస్ట్ వర్కింగ్ స్టిల్స్ చూస్తే ఈ చిత్రాన్ని రవికిరణ్ కోలా ఎంత ప్యాషనేట్, కాన్ఫిడెంట్గా తెరకెక్కిస్తున్నారో అర్థమవుతోంది. ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ డిసెంబర్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 'వైవిధ్యమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమా విజయ్ దేవర కొండ కెరీర్లోనే ది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. అలాగే విజయ్, కీర్తి సురేష్ జంట సిల్వర్ స్ర్కీన్ మీద కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుంది. ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇస్తుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ – డినో శంకర్, డీవోపీ – ఆనంద్ సి చంద్రన్, ప్రొడ్యూసర్స్ – దిల్ రాజు, శిరీష్, స్టోరీ – డైరెక్షన్ – రవికిరణ్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -