హార్ముజ్‌లో రెండు చమురు ట్యాంకర్లను అడ్డుకున్న ఇరాన్
జోర్డాన్, కువైట్, బహ్రెయిన్, సిరియాలపై కొనసాగిన టెహ్రాన్ దాడులు
(నవ తెలంగాణ – జనరల్ డెస్క్)
మధ్యప్రాచ్యంలో వరుసగా తొమ్మిదో రోజూ అమెరికా, ఇరాన్ దాడులు కొనసాగాయి. రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేసి నిలిపివేశామని ఇరాన్ ప్రకటించడంతో జలసంధిలో నౌకల రాకపోకలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జోర్డాన్‌లోని అక్వాబా విమానాశ్రయంలో అమెరికా యుద్ధ విమానంపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశామని, అలాగే కువైట్‌లోని అల్ అదిరి శిబిరం పైన, సిరియాలోని అలీ అల్ సలేం విమానాశ్రయం పైన దాడులు జరిపామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సోమవారం తెలిపింది. అమెరికాకు చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్లను పెద్ద సంఖ్యలో ధ్వంసం చేశామని, యుద్ధ విమానాలను నిల్వ ఉంచే కేంద్రాలకు నష్టం కలిగించామని చెప్పింది. కాగా ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయి న్ లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇరాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్లను కువైట్ సైన్యం అడ్డుకుం టోంది. కువైట్‌లోని డీశాలి నేషన్ ప్లాంటుపై (ఉప్పు నీటితో మంచినీరుగా మార్చే ప్లాంటు) ఇరాన్ దాడి చేయడంతో అగ్నిప్రమాదం సంభవించింది. కాగా ఒమన్ తీరంలో జరిగిన దాడిలో ఓ నౌక మంటల్లో చిక్కు కొని సముద్రంలో కొట్టుకు పోయిందని బ్రిటన్ మారీటైమ్ అథారిటీ తెలిపింది. నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయపడ్డారు. వారిని ఓ పడవలో ఒడ్డుకు చేర్చారు. ఇదిలావుండగా ఇరాక్‌లో కూలిపోయిన ఇరాన్ డ్రోన్‌లో పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే క్రమంలో ఓ అమెరికా సైనికుడు చనిపోయాడు.
దాడులు కొనసాగుతాయి : రుబియో
ప్రపంచ వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యాలుగా చేసుకుం టున్న నేపథ్యంలో ఆ దేశంపై తమ దాడులు కొనసాగుతాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. ‘హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ జలమార్గం. ఆ జలమార్గంలో ఇరాన్ నిరంతరం నౌకలపై దాడులు చేస్తోంది’ అని ఆరోపించారు. హార్ముజ్‌పై నియంత్రణ కోసం ఇరాన్ పట్టు పట్టినంత కాలం తాము స్పందిస్తూనే ఉంటామని అన్నారు. దౌత్య పరిష్కారానికి అమెరికా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు.
ఇరాన్ నగరాలలో పేలుళ్లు
హార్ముజ్‌లోని కీలక రవాణా మార్గాలలో ప్రయాణించే వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుం టున్నందున దాని సామర్ధ్యాన్ని దెబ్బతీసేందుకు ఆదివారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున దాడులు జరిపామని అమెరికా సెంట్రల్ కమాండ్ చెప్పింది. అయితే దాడుల వివరాలను తెలియజేయలేదు. కాగా అమెరికా క్షిపణులు సోమవారం ఉదయం అనేక నగరాలను తాకాయని ఇరాన్ ప్రభుత్వ అధికార తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది. దాని సమాచారం ప్రకారం…తబ్రిజ్, ఛాబహార్, కొనారక్, బందర్ మషహర్, బందర్ ఇమాం ఖొమేనీలలో పేలుడు శబ్దాలు వినిపించాయి.
సురక్షితం కాని మార్గాలలో ప్రయాణిస్తున్నందునే… :
దాడులపై ఇరాన్
హార్ముజ్‌లో సురక్షితం కాని మార్గాలలో ప్రయాణిస్తున్నందునే నౌకలపై దాడులు చేస్తున్నామని ఇరాన్ తెలిపింది. ఆ మార్గాల లో ప్రయాణించాల్సిందిగా వాణిజ్య నౌకలను అమెరికా ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. అమెరికా దూకుడు కొనసాగినంత కాలం జలమార్గం సురక్షితం కాదని రివల్యూషనరీ గార్డులు స్పష్టం చేశారు. ‘పెట్రో కెమికల్ ఉత్పత్తులు, చమురు, గ్యాస్ రవాణాకు ఈ మార్గం ఎంతమాత్రం సురక్షితం కాదు’ అని చెప్పారు. ఈ మార్గంలో శనివారం ఎనిమిది నౌకలు ప్రయాణించగా ఆదివారం నాలుగు మాత్రమే రాకపోకలు సాగించాయి. జలసం ధిలో శుక్రవారం నుంచి ఇప్పటి వరకూ మూడు చమురు ఉత్పత్తుల ట్యాంకర్లు, ఓ భారీ ముడి చమురు నౌక ప్రవేశించాయి. హార్ముజ్‌లో నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో చమురు సరఫరాలకు తీవ్ర ఆటం కం కలుగుతోంది. గత నెల రోజులలో ఎన్న డూ లేఁ విధంగా బ్యారల్ చమురు ధర 90 డాలర్లు దాటింది. జూన్ 11వ తేదీ తర్వాత బ్రెంట్ క్రూడ్ గరిష్ట స్థాయికి చేరింది. అమె రికా`ఇరాన్ మధ్య దాడులు కొన సాగుతుండడంతో ప్రపంచ ఇంధన ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి.
తొమ్మిదో రోజూ దాడులు
- Advertisement -
- Advertisement -



