Saturday, March 14, 2026
E-PAPER
Homeజిల్లాలువిబిజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలి: సీపీఐ(ఎం)

విబిజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలి: సీపీఐ(ఎం)

- Advertisement -
  • సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందేబోయిన ఎల్లయ్య డిమాండ్.
    నవతెలంగాణ – రాయపోల్
  • విబిజీ రాంజీ పథకాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్న ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫోటో క్యాప్చర్) విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న విధంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. శనివారం రాయపోల్ మండలం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాయపోల్, అనాజీపూర్ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలకు ఉపాధి అవకాశాలు తగ్గించే విధంగా అనేక మార్పులు చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచిందని ఆరోపించారు. దానిని విబిజీ రాంజీ పేరుతో కొత్త పథకంగా మార్చడం దురుద్దేశపూరితమని విమర్శించారు. పని ప్రదేశాల్లో కార్మికుల ఫోటోలు తీసే విధానాన్ని అమలు చేయడం వల్ల లక్షలాది మంది కార్మికులు పని దినాలను కోల్పోతున్నారని తెలిపారు. ఒక రోజు ఫోటో పడితే మరుసటి రోజు ఫోటో నమోదు కాకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో సరైన నెట్‌వర్క్ సౌకర్యం లేకపోవడం, సెల్‌ఫోన్ సిగ్నల్ అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వందలాది మంది కార్మికులు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి పని ప్రదేశాలకు వెళ్లి గంటల తరబడి వేచి చూసి తిరిగి ఖాళీ చేతులతో ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.
  • అదేవిధంగా 2026–27 బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులను సుమారు 10 వేల కోట్ల రూపాయలు తగ్గించడం పేదలపై అన్యాయం అని ఆయన అన్నారు. గతంలో ఈ పథకంలో 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 40 శాతం చెల్లించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు విడుదల చేసే విధంగా మార్పులు చేశారని తెలిపారు. పని పూర్తయిన తర్వాత కూడా ఆ పనిని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఇవ్వడం వల్ల పేదలకు కూలి డబ్బులు అందకపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.ఉపాధి హామీ పథకంలో పని దినాలను 200 రోజులకు పెంచాలని, రోజువారీ కూలిని రూ.600 లకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పొట్టేల స్వామి, నాగరాజు, ఉపాధి హామీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -