డెలాయిట్ అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం నుంచి 6.8 శాతం లోపు వృద్ధిని నమోదు చేసే అవకాశముందని ఫైనాన్సీయల్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ ఇండియా తన తాజా ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదికలో అంచనా వేసింది. ఏడాది ద్వితీయార్థంలో పండుగల సీజన్‌లో వినియోగం పెరగడం, రిజర్వు బ్యాంకు ద్రవ్య సడలింపు చర్యలు, అంతర్జాతీయ పరిస్థితులు క్రమంగా మెరుగుపడటం కొంత మద్దతును ఇవ్వొచ్చని పేర్కొంది. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపడంతో వస్తువుల ధరల్లో అనిశ్చితి, పెట్టుబడిదారుల ఆందోళన, మూలధన ప్రవాహాల్లో తగ్గుదల, రూపాయి బలహీనత వంటి సవాళ్లు ఎదురవుతున్నాయని నివేదిక వెల్లడించింది.
గత నెలలో ఆర్‌బిఐ కూడా 2026-27లో వృద్ధి అంచనాను 6.9 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ప్రపంచ అనిశ్చితితో పాటు రుతుపవనాల ప్రభావం, ఆహార ద్రవ్యోల్బణం వృద్ధికి ప్రధాన సవాళ్లుగా మారవచ్చని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కీ మజుందార్ తెలిపారు. దేశీయ వినియోగ బాస్కెట్‌లో ఆహార పదార్థాల వాటా 46 శాతం ఉండటంతో ధరలు పెరిగితే ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం (సిపిఐ) 4.38 శాతానికి చేరిన నేపథ్యంలో ఈ అంశం కీలకమని వివరించారు.
వృద్ధి 6.8 శాతం లోపే..!
- Advertisement -
- Advertisement -



