Tuesday, July 21, 2026
E-PAPER
Homeఆటలు23 నుంచి పోలీసు జూడో క్లస్టర్‌ పోటీలు

23 నుంచి పోలీసు జూడో క్లస్టర్‌ పోటీలు

- Advertisement -

36 పోలీసు విభాగాల నుంచి 1600 మంది పోటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌ :
ఆల్‌ ఇండియా పోలీసు జూడో క్లస్టర్‌ పోటీలు ఈ నెల 23 నుంచి హైదరాబాద్‌ వేదికగా జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 36 పోలీసు విభాగాలు, సాయుధ బలగాల విభాగాల నుంచి 1600 మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఎనిమిది రోజుల పాటు జరుగనున్న ఈ పోటీల్లో ఐదు క్రీడాంశాలు.. జూడో, వుషూ, తైక్వాండో, కరాటే, పెన్‌కాక్‌ సిలాట్‌లో క్రీడాకారులు పోటీపడతారు. రాష్ర్టాల పోలీసు విభాగాలతో పాటు కేంద్ర సాయుధ బలగాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు నేషనల్‌ ఇండస్ర్టీయల్‌ సెక్యూరిటీ అకాడమీ (ఎన్‌ఐఎస్‌ఏ) డైరెక్టర్‌ హర్‌ప్రీత్‌ కౌర్‌ సోనీ సోమవారం విలేకరుల సమావేశంలో టోర్నమెంట్‌ వివరాలను వెల్లడించారు. జూడో క్లస్టర్‌ పోటీల మస్కట్‌ ‘వీరా’ను బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌, రోయింగ్‌ కోచ్‌ ఇస్మాయిల్‌ బేగ్‌తో కలిసి హర్‌ప్రీత్‌ కౌర్‌ ఆవిష్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -